ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 16 అక్టోబరు 2022 (19:31 IST)

విశాఖ కాదు.. విజయసాయి రెడ్డి రాజధాని : ఎంపీ రామ్మోహన్

rammohan naidu
ఏపీ అధికార పార్టీ వైకాపా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం చేసేది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని, అవినీతి వికేంద్రీకరణ అని అన్నారు. 
 
"భూకబ్జాల కోసమే విశాఖ నగరాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని కాదు.. విజయసాయి రెడ్డి అని అన్నారు. రాజధానుల మార్పు యోచన నాడు తుగ్లక్‌ది కాదు నేడు అభినవ తుగ్లక్ వైఎస్. జగన్మోహన్ రెడ్డిది అని ఆరోపించారు.
 
ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది కొత్త రాజధాని కాదన్నారు. వారికి కావాల్సింది అభివృద్ధి అని అన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.