1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan demand United States of Andhra and announce 25 districts as States and go for 25 capitals.

ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా మార్చాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నవ్యాంధ్రకు మూడు రాజధానులే ఎందుకు.. 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా మార్చాల్సిందని ఆయన విమర్శలు గుప్పించారు .
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజధాని వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి జరుగుతుందని వైకాపా ప్రభుత్వం భావిస్తుంటే కేవలం మూడు రాజధానులే ఎందుకు పరిమితమయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థ కంటే తామే గొప్ప అని వైకాపా భావిస్తుందని విమర్శించారు. 
 
రాష్ట్ర ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలని 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. 
 
విసాఖ జిల్లాలోని రుషికొండ పర్వతశ్రేణుల్లో ఉన్న ఈ మౌంట్ దిల్ మాంగే మోర్" ధన, వర్గ కులస్వామ్యానికి చిహ్నమని బూతులకు కూడా అని ట్వీట్ చేశారు. 
 
అదేసమయంలో అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్ మోర్ ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ, విశ్వాసాలకు ఇది నిదర్శనమని చెప్పారు. 
తర్వాతి కథనం
5జీ వేగంలో అదరగొట్టిన జియో.. తర్వాతి స్థానంలో ఎయిర్ టెల్