శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:52 IST)

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించి.. 25 రాజధానులను ఏర్పాటు చేయండి

Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైకాపాపై సెటైర్లు విసురుతూ ట్వీట్ చేశారు. ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలని పవన్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. 
 
25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులను ఏర్పాటు చేయండని పేర్కొన్నారు. చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్లు భావిస్తే ఎలా అంటూ అడిగారు. అలాగే ప్రవర్తిస్తున్నారని.. ప్రజల అభిప్రాయాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా వైకాపా తన పనేంటో తాను చేసుకుపపోతోందని.. పవన్ ఫైర్ అయ్యారు. ఏమాత్రం సంకోచం లేకుండా.. రాష్ట్రంలో వైకాపా రాజ్యాంగాన్ని అమలు చేయండంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దేనికీ గర్జనలు అంటూ పవన్ చేసిన ట్వీట్లపై వైకాపాకు చెందిన పలువురు మంత్రులు ఆయనపై చేసిన విమర్శలకు ఘాటుగా ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. 
 
అంతటితో ఆగకుండా.. అమెరికాలోని సౌత్ డకోటాలో వున్న మౌంట్ రష్‌మోర్ ఫోటోను పవన్ పోస్టు చేశారు. దానిని రుషి కొండగా అన్వయించి.. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ విశ్వాసాలకు మౌంట్ రష్ మోర్ చిహ్నమన్నారు. రుషికొండ పర్వత శ్రేణుల్లో వున్న మౌంట్ దిల్ మాంగే మోర్.. ధన వర్గ కుల స్వామ్యానికి చిహ్నమని కొందరు వ్యక్తుల కార్టూన్లను అందుకు జోడించారు.  
Pawan Satirical tweet
Pawan Satirical tweet