సంబంధిత వార్తలు
- రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి, 100 కోట్ల గ్రాస్ వచ్చిందా!
- సురేఖ భయంతో రాత్రి నిద్రపోలేదుః ఏ ఒక్కరూ గొప్పకాదుః చిరంజీవి
- చిరంజీవి అమ్ముడుపోలేదు, అమ్ముకున్నారుః ఎన్విఎస్. ప్రసాద్
- గరిక బ్రహ్మాగా మారాడంటే రాముడు (చిరంజీవి) లాంటివారే కారణం
- అశోకవనంలో సీతాదేవి "గడ్డిపరక"తో ఎవరిని పోల్చిందీ?: గరికపాటి కామెంట్స్ పై స్ట్రాంగ్ రియాక్షన్స్
చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య విభేదాల మాట నిజమేనా!
Chiranjeevi, Allu Aravind
మొన్ననే మా నాన్నగారైన అల్లు రామలింగయ్యగారి వంద సంవత్సరాల జయంతి సందర్భంగా మేమంతా కలిసి వచ్చాం కదా. ప్రతి పండుగగకు, కుటుంబంలో ఏదో సందర్భంలో అలా కలుస్తూనే వుంటాం. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. మా బావ చిరంజీవి. బావ బావమరుదల మధ్య సహజంగా ఏవో వుంటాయని ప్రజలు భావించవచ్చు. అలాంటిది ఏమీలేదు అంటూ వివరించారు.
పనిలోపనిగా బాల ఎలాపరిచయం అయ్యారు అన్న ప్రశ్నకు, గోపీచంద్ అనే నిర్మాతను కలవడానికి వెళ్ళినప్పుడు లోపలనుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ఈయన అల్లు అరవింద్ గారంటూ అతనికి నిర్మాత పరిచయం చేశారు. తను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయనే చిరంజీవి. ఆ తర్వాత మా ఇంటిపైన మా బంధువు సత్యనారాయణ వుండేవాడు. ఆయన కోసం చిరంజీవి వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టి సత్యనారాయణగారు వున్నానా అని అడిగితే, మా అమ్మ డోర్ తీసి పైన వున్నాడని చెప్పింది. అలా మా అమ్మ చిరంజీవిని చూడడం. అల్లుడు చేసుకోవాలని ఆలోచన ఆమెకు కలగడం.. ఆ తర్వాత నాన్నగారు ఓ షూటింగ్‌లో చిరంజీవి గురించి ఎంక్వయిరీ చేయడం అలా అలా జరిగిపోయాయి అంటూ వివరించారు. మొదట షేక్ హ్యాండ్ ఇచ్చిన చేయి అలా కంటెన్యూగా మా ఇంటివాడిని చేసిదంటూ హాస్యోక్తిగా అన్నారు.
