గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (23:26 IST)

చిరంజీవి అమ్ముడుపోలేదు, అమ్ముకున్నారుః ఎన్‌విఎస్‌. ప్ర‌సాద్‌

nvs prasad-chiru
nvs prasad-chiru
చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ సినిమాను నిర్మించిన ఎన్‌విఎస్‌. ప్ర‌సాద్ చిరంజీవి గురించి నిజాలు చెబుతున్నా. బ‌య‌ట ఎవ‌రికీ తెలీవు అంటూ మాట్లాడారు. గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ, ఇది అప్ర‌స్తుతం అయినా చెప్ప‌క‌త‌ప్ప‌దు అంటూ వివ‌రించారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టాక చిరంజీవిగారు అమ్ముడుపోయార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ అస‌లు నిజం మీకు చెప్పాలి. ఆ పార్టీ పెట్టాక న‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌ద‌రాసులోని ఆయ‌నుకున్న ఆర్‌.కె. గార్డెన్స్ ప‌క్క‌న ఆస్తుల్ని అమ్ముకుని న‌ష్టాన్ని పూడ్చారు. ఇవ‌న్నీ చాలామందికి తెలీవు. 
 
జ‌న‌సేన పార్టీ పెట్టింది అందుకే
నాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టుడు అవ్వ‌క‌ముందునుంచీ తెలుసు. ఆయ‌న యోగా నేర్చుకోవ‌డానికి తిరుప‌తిలో యోగా గురువు ద‌గ్గ‌ర నేర్చుకున్నారు. చిరంజీవిగారు రాజ‌కీయ పార్టీ ప్ర‌జారాజ్యం పెట్టారు. అస‌లు ప్ర‌జారాజ్యంలోనుంచి పుట్టిన బాధ‌, ఆవేశ‌మే జ‌న‌సేన అంటూ క్లారిటీ ఇచ్చాడు.
 
ఆరోజు చిరంజీవిగురించి చాలామంది ఏమి మాట్లాడారో దానికి స‌మాధాన‌మే జ‌న‌సేన పార్టీ. చిరంజీవిగారు చాలా మంచి వారు. ఎవ‌రు ఏం మాట్ల‌డినా చెల్లిబాబు అవుతుందంటే వినేవాడులేడు. కొంత‌మందిని మ‌నం వ‌దులుకోవాల‌ని అంటూ చిరంజీవికి సూచించారు. మీరు గౌర‌వంగా వున్నారు. గాడ్ ఫాద‌ర్‌గా వున్నారు అందుకే మీ మీద పాయింట్ చేస్తున్నారు. అందుకే ఇష్యూలు వ‌స్తున్నాయ్‌. ఓ వ్య‌క్తిని బాధ‌పెట్టేముందు ఆయ‌న మ‌న‌స‌త్వం గురించి తెలుసుకోవాలి.
 
అదేవిధంగా విడుద‌ల‌కు ముందు స‌రిగ్గా ప్ర‌మోష‌న్ చేయ‌లేద‌ని కామెంట్లు వ‌చ్చాయి. మీడియా కూడా తెగ రాసింది. కానీ విడుద‌ల‌కుముందు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మీకు తెలుసా. నిద్ర‌హారాలు మాని థ‌మ‌న్‌తోపాటు అంద‌రూ ప‌నిచేశాం అంటూ తెలిపారు.