గరిక బ్రహ్మాగా మారాడంటే రాముడు (చిరంజీవి) లాంటివారే కారణం
మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావుల మధ్య జరిగిన మాటల తీరు ఇంకా సద్దుమణగలేదు. శనివారంనాడు గరికపాటివారు చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడినా వారిద్దరి మధ్య జరిగిన విషయాలు బయటకు రాకపోయినా బయట మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే వుంది. ఇందుకు నిదర్శనంగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ వేదిక అయింది.
జోరున వర్షంలోనూ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. అయితే అందులో సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ, చిరంజీవిని ఇంద్రుడు, చంద్రుడు అన్నంతగా పొగిడేశారు. ఆ వెంటనే అన్నయ్య అంటే ఎంతోమందికి వేలమందికి పని కల్పించే ఆయన్ను గరికపాటివారు మాట్లాడినతీరును ఎండగట్టారు.
ఆ తర్వాత మాట్లాడిన గీత రచయిత అనంత్ శ్రీరామ్ సరికొత్త కథను చెప్పారు. సీత దగ్గరకు హనుమంతుడు వెళ్ళి రాముడు దూతగా వచ్చానంటే, అందుకు గుర్తు అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు సీతకు ఇలా చెబుతాడంటూ కథను చెప్పాడు. రామాయణంలో సీత, రాముడు సన్నిహితంగా వున్న విషయాన్ని హనుమంతుడికి చెప్పే సన్నివేశాన్ని వివరించారు. సీత ఒడిలో రాముడు నిద్రిస్తుండగా ఓ కాకివచ్చి పొడుస్తుంది. సీత భరిస్తూ రాముడు నిద్రాభంగం అవుతుందని భరించింది. కానీ సీత నుంచి కారుతున్న రక్తం రాముడును టచ్ చేయగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత శాంతమూర్తుడైనా రాముడు కూడా కోపోద్రిక్తుడై పక్కనే గరిక తీసుకుని కాకిపై విసిరారు. అది బ్రహ్మాస్త్రంగా మారింది.
ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే, గరికలాంటివారు బ్రహ్మాగా మారాలంటే అది రాముడులాంటివారివల్లే అంటూ ఇన్‌డైరెక్టర్‌గా చిరంజీవిని రాముడుగా అభివర్ణిస్తూ, గరికపాటి నరసింహరావు లాంటివారు నిజంగా గరికలాంటివారే అంటూ చురకవేయడం విశేషం. మరి గరికపాటి వారు దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.