శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (13:22 IST)

అశోకవనంలో సీతాదేవి "గడ్డిపరక"తో ఎవరిని పోల్చిందీ?: గరికపాటి కామెంట్స్ పై స్ట్రాంగ్ రియాక్షన్స్

chiru-garikapati-datrateya
chiru-garikapati-datrateya
ద‌స‌రా సంద‌ర్భంగా అల‌య్‌బ‌ల‌య్ అనే కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు, ఆథ్యాత్మిక వేత్త‌లు, సాహితీ వేత్త‌లు అంతా ఒకే వేదిక‌పై వ‌చ్చారు. దీనిని గవర్నర్ ద‌త్తాత్రేయ ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుక‌లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు మాట్లాడుతూ, నేను వెళ్ళిపోతాను. నాకు మొహ‌మాటం లేద‌ని వ్యాఖ్యానించ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపై వెంట‌నే నాగ‌బాబు రియాక్ట్ అయ్యారు. దాంతో తెలుగు సినిమారంగం చిరంజీవి స‌పోర్ట్‌గా నిలిచింది. మ‌రోవైపు అభిమాన సంఘాలు నేరుగా గ‌రిక‌పాటికి ఫోన్ చేసి వివ‌ర‌ణ అడిగాయి.

 
వ‌రంగ‌ల్ అభిమాన సంఘం నాయ‌కుడు శ్రీ‌ను ఫోన్‌లో మాట్లాడుతూ, మొన్న జ‌రిగిన ఉదంతం గురించి మీరు చేసిన మాట‌లు మ‌మ్మ‌ల్ని హ‌ర్ట్ చేశాయి. మీరు చాలా గొప్ప మేథావి. మీ ఉప‌న్యాసాలు విని మేం చాలా మారాం అని చెబుతూ, ఒక్క‌సారి అన్న‌య్య‌తో మీరు మాట్లాడాలి అన్నారు. దీనిపై గ‌రిక‌పాటి స్పందిస్తూ, మీరు అలా బాధ‌ప‌డ‌టం క‌రెక్టే. మీర‌న్న‌ట్లు నేను చిరంజీవిగారితో ఇప్పుడే మాట్లాడ‌తాను అంటూ చెప్ప‌గానే అభిమాన సంఘం నాయ‌కుడు శాంతించారు. ఈ వీడియో సోష‌ల్‌ మీడియాలో ఫాన్స్ పెట్టారు.

 
ఇక ఇదిలా వుంటే, ప‌లువురు విశ్లేష‌కులు కూడా గ‌రిక‌పాటి ఉదంత‌పై క‌ర్ర‌ విర‌గ‌కుండా, పాము చావ‌కుండా అన్న‌రీతిలో తెలియ‌జేస్తున్నారు. తెల‌క‌ప‌ల్లి రవి యూట్యూబ్‌కు వివ‌రిస్తూ, అస‌లు అక్క‌డేం జ‌రిగిందో ఆయ‌న ఎందుకన్నారో అనేదీ చ‌ర్చ‌క‌న్నా చిరంజీవిగారు సానుకూలంగానే స్పందిస్తూ ఇంటికి ఆహ్వానించారు గ‌దా అంటూ తేల్చేశారు. సినిమారంగంలోని ప‌లువురు దీనికి ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య ఇలా తెలియ‌జేస్తున్నారు. 

 
"బతికున్నంత కాలం నేను ఆడే అందమైన అబద్ధాన్ని నేను.. మరణానంతరం నా గురించి ఇతరులు ఆడే అబద్ధాన్ని నేను.. ఎప్పుడూ నేను "నిజాన్ని" కాను.. అందుకే రమణ మహర్షి మొదట ఆ "నేను" తీసెయ్ "నీ"లోంచి అన్నారు.. కాబట్టి మాట్లాడితే "నేనెళ్లి పోతాను, నేనెళ్లి పోతాను" అని గింజుకోకూడదు.
 
అందరమూ ఏదో ఒకరోజు వెళ్లి పోవలసిన వారమే అని తెలుసు కాబట్టి ఉన్నన్నాళ్లు వినయంతో విజ్ఞతతో, సహనంతో, సంయమనంతో మసలుకోవాలి. లేకపోతే మనం పోయాక సమాజం కొంతైనా మన గురించి నిజం చెప్పదింక.. కళాకారుడిదేముంది.. మరణానంతరం కూడా మనుగడ ఉన్న అరుదైన గొప్ప వరం ఉంది.
 
అందుకే మనసులో నవ్వుకున్నా, పైకి వినయంగా ఉంటాడు.. తన పని తాను కాయకష్టంగా చేసుకుంటూ పోతాడు.. పదిమందిని ప్రభావితం చేయగలిగిన అశేష ప్రజాభిమానం ఉన్నవాడు వినయంగా ఉన్నాడంటేనే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అర్ధం చేసుకుని కుదురుగా ఉండాలి.
 
రాముడు వినయంగా ఉండడం వల్లే "హీరో" అయ్యాడు. రావణబ్రహ్మ మహా విజ్ఞాని, గొప్పవాడు అయినా అహంకారం వల్ల విలన్ అయ్యాడు. అశోకవనంలో సీతా దేవి "గడ్డిపరక"తో ఎవరిని పోల్చిందీ?