బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (11:39 IST)

ఢిల్లీలో ద‌స‌రా జ‌రుపుకున్న ప్ర‌భాస్‌, నేడు హైద‌రాబాద్‌లో ఆదిపురుష్ 3డి టీజ‌ర్‌

prabhas-banam
prabhas-banam
ద‌స‌రా పండుగ‌రోజు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఢిల్లీ వెళ్ళారు. అక్క‌డ రావ‌ణసంహారంగా బాణం ఎక్కుపెట్టి ఢిల్లీలోని  రామ్‌లీలాలో రావణ్ దహనాన్ని బృందం దసరా పండుగను జరుపుకుంటుంది. ప్రతిరోజూ చెడుపై మంచి శక్తిని జయిస్తుంది. అంటూ మాట్లాడారు. త‌న ఆదిపురుష్ చిత్రం టీజ‌ర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. దానిపై ర‌క‌ర‌కాలుగా అభిప్రాయాలు వ‌చ్చాయి.
 
prabhas-sanmanam
prabhas-sanmanam
ఇక నేడు అన‌గా గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లో ఆదిపురుష్ తెలుగు వ‌ర్ష‌న్ టీజ‌ర్‌ను ప్రత్యేకంగా 3D ఫార్మాట్‌లో స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. దర్శకుడు ఓమ్‌రౌత్,  నిర్మాత భూషణ్ కుమార్ రాబోతున్నారు. ఇటీవ‌లే త‌న పెద్ద‌నాన్న కార్య‌క్ర‌మాల‌ను మొగ‌ల్తూర్‌లో పూర్తిచేసి ఆ త‌ర్వాత ఆదిపురుష్ సినిమాపై కాన్‌స‌న్ ట్రేష‌న్ చేశారు ప్ర‌భాస్‌. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతోంది. అదేవిధంగా చైనా, జపాన్‌ల‌లోనూ విడుద‌ల‌కాబోతుంది.