శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:04 IST)

జాబ్ కార్నర్ : డీఆర్డీవోలో సైంటిస్ట్ పోస్టులు

ఢిల్లీలోని భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీవోకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) కింద మొత్తం 17 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డీఆర్డీవో ఆహ్వానిస్తుంది. 
 
సైంటిస్ట్-బి విభాగం కింద భర్తీ చేసే ఈ 17 ఖాళీలను అప్లయిడ్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, కౌన్సెలింగ్ / గైడెన్స్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, మిలిటరీ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, ఫిజియోలజికల్ సైకాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థుల సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే, గేట్ లేదా నెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 యేళ్ళకు మించరాదు. 
 
దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును 100 రూపాయలు చెల్లించి, ఉద్యోగ ప్రకటన వెలువడిన 28 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.