శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:21 IST)

పీఎఫ్‌ఆర్డీయేలో ఉద్యోగ అవకాశాలు - అర్హత డిగ్రీ

Jobs
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‍‌ఆర్డీఏ)లో 22 ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
పీఎఫ్ఆర్డీయేలో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, లీగల్, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైనజేష్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనోమెట్రిక్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
అలాగే, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 2022 జూలై 31వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 యేళ్లకు మించరాదు. ఈ అర్హతలు కలిగివున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని వచ్చే నెల 10వ తేదీ లోపు పంపంచాల్సివుంటుంది. అభ్యర్థుల ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000, ఇతర వర్గాల వర్గాల వారికి ఫీజు మినహాయింపు ఉంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.89150 నుంచి రూ.140000 వరకు వేతనం చెల్లిస్తారు.