శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:22 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ సీఈవో అరెస్టు

arrest
దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిబీఐ అధికారులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవోగా పని చేస్తున్న విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 
 
నిజానికి ఈ స్కామ్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు విచారణలకే పరిమితమైన సీబీఐ అధికారులు మంగళవారం తొలిసారి ఒక అరెస్టు చేశారు. 
 
ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న ఒన్లీ మచ్ లౌడర్ కంపెనీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆ సంస్థ సీవీఓగా పనిచేసిన విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి, ముంబై నుంచి ఢిల్లీకి తరలించారు. 
 
ఈ కేసు దర్యాప్తులు విజయ్ నాయర్ పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. దీంతో లిక్కర్ స్కామ్‌ ఎఫ్ఐఆర్‌లో ఐదో నిందితుడైన విజయ్ నాయర్‌ను అరెస్టు చేశారు.