బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (11:56 IST)

దేశ ప్రజలకు రాష్ట్రపతి - ప్రధాని - తెలుగు రాష్ట్రాల సీఎం విజయదశమి శుభాకాంక్షలు

dussehra
దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను బుధవారం ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగ్దీష్ దన్కర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్. జగన్, కె.చంద్రశేఖర్ రావులు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
"విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అనైతికతపై నీతి, అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. ఈ పండగ దేశ ప్రజలందరిలో సంతోషం, శాంతి తీసుకురావాలి" అంటూ రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. 
 
"విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాక్షలు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోడీ కోరారు. 
 
అలాగే, ప్రజలకు సీఎం కేసీఆర్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. 
 
అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయ‌పడ్డారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా విజయదశమి శుక్షాకాంక్షలు తెలిపారు.