శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (17:19 IST)

ఆంధ్రప్రదేశ్‌ను మూడు ముక్కలు చేస్తే ముగ్గురు సీఎంలు కావొచ్చు : జగ్గారెడ్డి

jagga reddy
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు కావొచ్చని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణాలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిలకు జగ్గారెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సంగారెడ్డిలో పర్యటిస్తున్న షర్మిల.. జగ్గారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి జగ్గారెడ్డి ధీటుగా సమాధానమిచ్చారు. షర్మిల తన జోలికి రాకుంటే తాను కూడా ఆమె జోలికి వెళ్ళనని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ కటుంబంలో గొడవ జరుగుతోందన్నారు. ఆ గొడవకు పరిష్కారం కావాలంటే ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు కంటే ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే (మూడు రాష్ట్రాలు) ముగ్గురు సీఎంలు కావొచ్చన్నారు. అలా చేయడం వల్ల జగన్‌తో పాటు సీఎం కుర్చీకోసం ఎదురు చూస్తున్న షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా సీఎం అయిపోవచ్చన్నారు. షర్మిల తన కుటుంబ పంచాయతీని ఏపీలోనే పెట్టుకోవాలని హితవు పలికారు. ఇందుకోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.