సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (09:56 IST)

మేమింకా విడాకులు తీసుకోలేదు.. రేవంత్‌తో భేటీపై జగ్గారెడ్డి కామెంట్స్

ఇటీవలికాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరిగింది. ఇది పార్టీలో అలజడి రేపింది. జగ్గారెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపారు. అలాగే, పార్టీ సీనియర్ నేతలు కూడా జగ్గారెడ్డిని బుజ్జగించారు 
 
అయితే, రేవంత్ రెడ్డి అనుచరులు తనను ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, అందువల్ల తాను పార్టీలో కొనసాగలేనని జగ్గారెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
 
ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపారు. విలేఖరుల ప్రశ్నలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. తాము విడాకులు తీసుకోలేదని, విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా పక్కన కూర్చుంటే తప్పేనని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.