శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (17:37 IST)

టీడీపీ మాజీ నేతలను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి : వీహెచ్ ఫైర్

టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత వి.హనుమతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 
 
ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తే, అధిష్టానం తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, ఇలా అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరును రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీన్ని కూడా వీహచ్ తప్పుబట్టారు. బీహార్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ అధికారులు పని చేయడం లేదా అని ప్రశ్నించారు.