1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana MLA Jagga Reddy set to quit Congress?

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. పార్టీకి జగ్గారెడ్డి రాంరాం!

Sangareddy
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాం రాం చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి). అంతేగాకుండా శనివారం పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా సమాచారం. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని చెప్పారు.
 
పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను అవమానించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని, ఇవన్నీ తట్టుకోవడం ఇక తన వల్ల కాకపోవడం వల్లే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. 
 
కాగా 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కరే. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న ఆయన పలుమార్లు బాహాటంగానే తన వ్యతిరేకతను బయటపెట్టారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
విజయనగరం వార్డు వాలంటీర్ ఘరానా మోసం.. రూ.3 కోట్లు స్వాహా