1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Congress MLA KR Ramesh Kumar under fire for rape comment in assembly

కాక రేపుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు - రేప్‌ను ఆస్వాదించాలట..

Congress MLA KR Ramesh Kumar
అత్యాచారం నుంచి తప్పించుకునే వీలులేనపుడు దాన్ని ఆస్వాదించడమే మేలు అంటూ కర్నాటక రాష్ట్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల కర్నాటక రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగింది. అధికార, విపక్ష సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. దీంతో సభను నియంత్రించడం స్పీకర్‌ విశ్వేశ్వర్‌కు కష్టంగా మారింది. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ, పరిస్థితిని నియంత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అనుకుంటున్నాను. మాట్లాడుకోండి అని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై కల్పించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్... "అత్యాచారం అనివార్యమైనపుడు దానిని ఆస్వాదించడమే మేలు" అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈయన గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గత 2019లో సభాపతిగా ఉన్నారు. ఆ సమయంలో తన పరిస్థితి అత్యాచారం బాధితురాలిగా ఉందంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్నే రేపారు. 
 
"అత్యాచారం జరిగినపుడు అంతటితో అక్కడ వదిలేస్తే సరిపోతుంది. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు, న్యాయవాదులు వచ్చి ఎన్నిసార్లు జరిగింది. ఎలా జరిగింది. ఎంతమంది చేశారు ఇత్యాది ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సాధారణంగా అత్యాచారం ఒక్కసారే జరుగుతుంది. కానీ, కోర్టు వందసార్లు జరుగుతుంది. ఇపుడు నా పరిస్థితి అలానేవుంది" అని అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్ష వాయిదా