1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (13:04 IST)

హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు: జమీర్ అహ్మద్

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉందని అహ్మద్ అన్నారు. 
 
ఇస్లాం పరిభాషలో 'హిజాబ్' అంటే 'తెర' అని అర్థం. ఓ వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిల సౌందర్యాన్ని ఈ హిజాబ్ దాచి ఉంచుతుందని పేర్కొన్నారు. 
 
మహిళలు హిజాబ్ ధరించనప్పుడు వారు అత్యాచారాలకు గురవుతున్నారు. దేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుండడానికి కారణం ఇదేనని జమీర్ అహ్మద్ వెల్లడించారు.
 
అయితే హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదని, ఎవరైతే తమను తాము కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్లు హిజాబ్ ధరించవచ్చని కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదేనని అభిప్రాయపడ్డారు.