గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:51 IST)

ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. 
 
ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఈ సిఫార్సుకు కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఫలితంగా తర్లాడ రాజశేఖర రావు, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాస రెడ్డి, వడ్డిబోయిన సుజాతలు ప్రమాణ స్వీకారం చేశారు.