శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (19:50 IST)

వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి

ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు, నేతలకు పనిపాట లేకుండా, ప్రతిపక్షాల మీద పాటిస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ మూడేళ్ళ కాలంలో ఒక్క వైసిపి ఎమ్మెల్యే అయిన ఈ అభివృధ్ధి పని చేసానని కాలర్ ఎగరేసి చెప్పగల పరిస్థితి ఉందా…? అంటూ ఆమె నిలదీశారు. 
 
వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలలో బాగా చర్చ జరుగుతోందన్నారు. వైసిపి అధికార్లలోకి రావడానికి బాగా పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరుతో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 
 
వైసిపి ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇద్దరు పెత్తనం చేసారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఇలా అన్ని గెలిచిన అభివృద్ది సున్నా అని ఎద్దేవా చేశారు.