శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:48 IST)

పవన్ కళ్యాణ్ సీఎం అయితే జాలర్ల సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల మనోహర్

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే రాష్ట్రంలోని జాలర్ల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో మత్స్యుకార అభ్యున్నతి యాత్రను ఆయన ప్రారంభించారు. 
 
ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, జాలర్ల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయమన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యుకారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 
 
అభివృద్ధి పేరుతో జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించడం సరికాదని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్న జాలర్లను ఆదుకునేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.