ప్రత్యేక హోదా అశాన్ని పొరపాటున చేర్చారు : జీవీఎల్ క్లారిటీ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన కేంద్ర హోం శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశంకానుంది. ఇందుకోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, కమిటీ సమావేశ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చెర్చారు. ఆ తర్వాత సాయంత్రానికి అది మాయమైపోయింది. దీనిపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పొరపాటున చేర్చారని చెప్పారు. ఈ భేటీ కేవలం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసమేనని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా అనేది ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం కాదని వివరణ ఇచ్చారు. అందువల్ల ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకెళ్లి తెలంగాణాతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. ఈ విషయంలో అధికార వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.