శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:17 IST)

దానికి దీనికి లింకు లేదురా మొగడా: బీజేపీ నేత సోము వీర్రాజు

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు, ఏపీ ప్రత్యేక హోదాకు ఎలాంటి లింకు లేదని బీజేపీ రాష్ట్ర
శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కేంద్ర హోం శాఖ కీలక చర్చలు జరుపనుంది. ఇందులో చర్చించేందుకు ఎనిమిది అంశాలు చేర్చారు. ఆ తర్వాత వీటిని ఐదింటికి మార్చారు. దీనిపై వైపాకా నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసంహా రావుల హస్తముందని ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ శాఖ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రత్యేక హోదా అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. కానీ, ఈ అంశాన్ని వైకాపా పాలకులు రాజకీయం చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఈ నెల 17వ తేదీన కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కేంద్ర హోం శాఖ జరుపుతున్న చర్చలు మాత్రమేనని చెప్పారు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంపై చర్చకు రాదన్నారు. అయితే, హోం శాఖ విడుదల చేసిన ప్రకటనలో పొరపాటున ఆ అంశాన్ని చేర్చారని ఆయన వివరణ ఇచ్చారు.