మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:46 IST)

హిజాబ్ వివాదం : నేటి నుంచి కర్నాటకలో స్కూల్స్

దేశంలో సంచలనం సృష్టించిన హిజాబ్‌ వివాదం తర్వాత కర్నాటక రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కేవలం పాఠశాలలు మాత్రమే తిరిగి తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మాత్రం తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. వీటిని తిరిగి తెరిచే అంశంపై ప్రభుత్వం కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 
 
ముఖ్యంగా, కాలేజీ, యూనివర్శిటీలు తిరిగి తెరిస్తే హిజాబ్ వివాదం మళ్లీ చెలరేకే అవకాశం ఉంటుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అదేసమయంలో పలు ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా, ఈ నెల 19వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. 
 
మరోవైపు, హిజాబ్ వివాదం సద్దుమణిగిపోయి, మున్ముందు శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్కూల్స్ తెరుచుకుంటాయని, మిగిలిన విద్యా సంస్థలను తెరిచే అంశంపై అధికారులతో సమీక్ష జరిపి తగిన నిర్మయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.