గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (10:32 IST)

హిజాబ్ వ్యవహారంలో వెనక్కి తగ్గని కర్ణాటక... కాలేజీ గేటు వద్దే..?

కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంలో వెనక్కి తగ్గట్లేదు. హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ గేటు వద్దే అడ్డుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత నెలల నుంచి ఇప్పటి వరకూ ఐదు కళాశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉడుపి జిల్లాల్లోని కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను అడ్డుకున్నారు. 
 
హైకోర్టు ఈ వివాదంపై తీర్పు వెలువరించేవరకూ అన్ని విద్యా సంస్థల్లో యూనిఫామ్ నిబంధనలు పాటించాలని శుక్రవారం పునరుద్ఘాటించింది. ఈ అంశంపై చర్చించడానికి అడ్వొకేట్ జనరల్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీవీ నగేశ్‌‌లు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తెలియజేయాలని సూచించారు.
 
 సమావేశం అనంతరం మంత్రి నగేశ్ మాట్లాడుతూ.. ఈ వివాదం ఇప్పటికే హైకోర్టుకు చేరినందున తీర్పు కోసం వేచిచూస్తున్నాం.. అప్పటి వరకూ అన్ని పాఠశాలలు, కాలేజీలు స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మోనటరింగ్ కమిటీలు నిర్దేశించిన డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా అనుసరించాలి’ అని తెలిపారు. కర్ణాటక విద్యా చట్టం ప్రకారం.. డ్రెస్‌కోడ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యా సంస్థలకు ఇవ్వబడిందన్నారు.