1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (02:01 IST)

హిజాబ్ తలను మాత్రమే కప్పివుంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు

కర్ణాటకలో హిజాజ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలని యువతి డిమాండ్ చేసింది. ఇస్లామిక్ ఆర్గనైజేషన్లు అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలపై ఆరోపణలను కొట్టిపారేసింది యువతి. 
 
ఈ మేరకు కర్ణాటక విద్యాశాఖ మంత్రితో హైకోర్టులో పిటిషన్ వేసిన యువతి మాట్లాడారు. తన రాజ్యాంగ హక్కులను డిఫెండ్ చేసుకుంటూ హాజ్రా షిఫా అనే యువతి.. హిజాబ్ మా తలను మాత్రమే కప్పివుంచుతుంది. మా బ్రెయిన్‌ను కాదు... అంటూ తెలిపింది. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా’ అని అడిగింది.
 
దీనికి సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నాగేష్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. కొన్ని ఆర్గనైజేషన్లు కావాలనే విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.