బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 డిశెంబరు 2021 (23:03 IST)

పాలు తాగితే మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే వారు, పాలు తాగని వారి కంటే జ్ఞాపకశక్తి, ఇతర మెదడు పనితీరు పరీక్షలలో గణనీయంగా ఎక్కువ స్కోర్ చేశారని పరిశోధకులు కనుగొన్నారు. పాలు తాగే వారితో పోలిస్తే, పాలు తాగనివారు పరీక్షలలో విఫలం అయ్యే అవకాశం ఐదు రెట్లు ఎక్కువ.

 
పాలు తాగడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి, అదే సమయంలో ఆకలి హార్మోన్ గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయి. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి జీవక్రియను పెంచడం ద్వారా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. మళ్లీ బరువు తగ్గడంలోనూ, బరువు నిర్వహణలో సహాయపడతాయి.