బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (20:19 IST)

జలుబును తరిమికొట్టే వెల్లుల్లి పాలు.. తయారీ ఇలా..?

Garlic milk
అసలే చలికాలం.. పిల్లలు, పెద్దలను జలుబు  వేధిస్తుంది. ఛాతిలోని శ్లేష్మాన్ని కరిగించి, తొలగించేందుకు వెల్లుల్లి పాలు భేష్‌గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
 
వెల్లుల్లి పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 200 మిలీ ఆవు పాలు, అర గ్లాసు నీరు, 7 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ పసుపు పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, పంచదార.. సరిపడా. 
 
ముందుగా పాలలో నీటిని కలిపి బాగా మరిగించాలి. వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, పాలలో వేసి ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు ఉడికిన తర్వాత దాన్ని తీసి పసుపు, మిరియాలపొడి వేసి కలపాలి. తర్వాత తగినంత పంచదార కలుపుకుని సేవించాలి. 
 
ఈ వెల్లుల్లి పాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు త్రాగండి. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఈ పాలు తాగండి. పాలు తాగిన తర్వాత మరేమీ తినవద్దు. 
 
ఈ వెల్లుల్లి పాలను పిల్లలకు ఇస్తే వెల్లుల్లి పరిమాణాన్ని తగ్గించాలి. పిల్లలకు తరచుగా ఇవ్వరాదు. ఈ వెల్లుల్లి పాలను వరుసగా 21 రోజులు తాగితే ఛాతీ శ్లేష్మం తొలగించి శ్లేష్మం పూర్తిగా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.