గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (19:15 IST)

లవంగాలతో పది ప్రయోజనాలు

1.లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటి నొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 
 
2.దగ్గుకు సహజమైనా మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 

3. ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉప శమనంగా ఉంటుంది. 
 
4.తేనె, కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

5. లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది. 
 
6. తులసి, పుదీనా , లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది . 

7. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. 

8. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది 

9. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది. 

10. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.