గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:58 IST)

ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 45 కిలోమీట‌ర్ల బైక్ జర్నీ

Electric Bike
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వాహ‌నాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు దృష్టిసారిస్తున్నారు ప్రజలు. తాజాగా ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థ‌కు చెందిన విద్యార్థులు త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేసే ఎల‌క్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. 
 
బైక్‌కు లిథియం అయాన్ బ్యాట‌రీని అమ‌ర్చి, వెనుక చ‌క్రానికి మోటార్‌ను అమ‌ర్చారు. త‌క్కవ ఖ‌ర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఈ బైక్‌ను రూపొందించారు.
 
ఈ బైక్ గంట‌కు సుమారు 60 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావ‌డానికి రెండున్నర గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌సారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 45 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 
 
45 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయ‌డానికి కేవ‌లం రూ. 15 ఖ‌ర్చు అవుతుంద‌ని బైక్‌ను రూపొందించిన విద్యార్థులు చెప్తున్నారు.