1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:45 IST)

హిజాబ్ వివాదం : కర్నాటక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం : సుప్రీంకోర్టు

కర్నాటక రాష్ట్రంలో చెలరిగే దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కర్నాటక హైకోర్టు వెలువరించే తీర్పును కోసం తాము కూడా వేచి చూస్తున్నామని, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఒక స్పష్టత నిస్తామని తెలిపింది. 
 
హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్ళకు హాజరుకావొద్దంటూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హిజాబ్ అంశంపై తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించింది. పైగా, కర్నాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.