శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (07:09 IST)

ర‌జ‌నీకాంత్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన చిరంజీవి, 100 కోట్ల గ్రాస్ వ‌చ్చిందా!

chiru-rajani
chiru-rajani
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని చూసిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభినంద‌లు తెలిపారు. ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు మోహన్ రాజా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అద్భుతం, చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ మోహన్ రాజా సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపారు. తన జీవితం లో ఇదొక బెస్ట్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు.
 
ఈ విష‌యాన్ని చిరంజీవి ట్విట్ట‌ర్‌లో బ‌దులిస్తూ, త‌లైవాకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ చిరంజీవి, ర‌జ‌నీకాంత్ వున్న పోస్ట‌ర్‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతేకాకుండా వారిద్ద‌రూ క‌లిసిన న‌టించిన సినిమాలోని ప్రోమోను కూడా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా గాడ్ ఫాద‌ర్ 100 కోట్ల గ్రాస్ వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌చ్చిందంటూ ఓ పోస్ట‌ర్ కూడా విడుద‌ల‌చేసి చిరంజీవి చూపించారు.