గంటసేపు రజనీకాంత్, శరత్ కుమార్ మంతనాలు
Rajinikanth, Sarath Kumar
రజనీకాంత్ తన స్వగృహంలో శరత్ కుమార్‌తో తెలుగు, తమిళ చిత్ర రంగంలోని సినిమాల గురించి గంటసేపు సోమవారంనాడు చర్చించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పొన్నియన్ సెల్వన్ చిత్రం విజయం సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అందులో భాగంగా సోమవారంనాడు ఫోన్‌లో శరత్‌కుమార్‌ను తనింటికి రమ్మని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్‌తోపాటు ఆయన కుమార్తె వరలక్ష్మీ కూడా హాజరైంది.
Rajinikanth, Sarath Kumar, Varalakshmi
ఈ సందర్భంగా పి.ఎస్.1లో శరత్‌కుమార్ నటనను చిత్ర కథాంశాన్ని లొకేషన్లను ఇతర నటీనటుల అభినయాన్ని రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని శరత్‌కుమార్ తెలియజేస్తూ, చెప్పలేని ఆనందాన్ని అనుభవించానని తెలిపారు. ఇక తెలుగు, తమిళ రంగంలోని విషయాలు చర్చకు వచ్చాయి. ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాగా మారిందని రజనీ అన్నట్లు తెలుస్తోంది. ఇక వరలక్ష్మీ చిత్రాలను గుర్తుచేస్తూ ఆమె నటనను మెచ్చుకోవడం మరో విశేషం.