విశాల్ ఇంటిపై దాడికి కారణం అదేనా!
కథానాయకుడు విశాల్ ఇంటి అద్దాలను రాళ్ళతో కొందరు దుండగులు పగులగొట్టారు. నిన్న విశాల్ ఇంటి వద్దకు గుర్తుతెలియని దుండగులు వచ్చి రాళ్లతో దాడి చేసి కిటికీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన అంతా ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విశాల్ అన్నానగర్‌లో తల్లిదండ్రుల వద్ద వుంటున్నాడు.
దీని ఆధారంగా విశాల్ మేనేజర్ వి హరికృష్ణన్ అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్ర కారులో వచ్చిన దుండగులు విశాల్ నివాసంపై రాళ్లతో దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాళ్లదాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా సమర్పించాడు.
విశాల్ నివాసం సమీపంలో కారు ఆగడం మరియు ప్రయాణీకుడి వైపు నుండి ఒక వ్యక్తి దిగడం ఫుటేజీలో కనిపించింది. అతను ఇంటిపై రాళ్లు రువ్వాడు మరియు కొన్ని సెకన్లలో అదే కారులో వేగంగా వెళ్లిపోయాడు. ఈ దాడి సమయంలో విశాల్ ఇంటిలో లేదరు. షూటింగ్ నిమిత్తం ఔట్‌డోర్‌లో వున్నారు.
ఇదిలా వుండగా, విశాల్‌కు తమిళ పరిశ్రమలో శత్రువులున్నారు. ఆయన తెలుగువాడు. అందుకే తమిళులపై ఆధిపత్యాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తమిళపరిశ్రమ నడిఘర్ సంఘం జనరల్ సెకట్రరీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ ఏర్పాట్లుకు ఫండ్ కూడా వసూలు చేస్తున్నారు. ఈ దశలో కొన్ని గొడవలు జరిగాయి. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా సంస్థ తమకు విశాల్ డబ్బులు ఇవ్వాలని కేసు కూడా వేసింది. ఇన్ని గొడవల మధ్య ఎవరు దాడి చేశారనేది పోలీసులు త్వరలో చేదిస్తామని తెలియజేశారు.