1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (15:18 IST)

ముంతాజ్‌పై గృహ‌హింస కేసు

Mumtaz
Mumtaz
న‌టి ముంతాజ్‌పై గృహ‌హింస కేసు న‌మోదుఅయింది. రెండురోజుల‌క్రితం ఆమెపై ఇద్ద‌రు మ‌హిళ‌లు చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అన్నాన‌గ‌ర్‌లో వుంటున్న ముంతాజ్ ఇంటిలో యు.పి.కి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌లు ప‌నిచేస్తున్నారు. అందులో ఒక‌రు మైన‌ర్‌. గ‌త ఆరేళ్ళుగా ఇక్క‌డే ప‌నిచేస్తున్నామ‌నీ, చాలాసార్లు త‌మ ఊరు వెళ‌తామంటే చిత్ర‌హింస‌ల‌కు గురిచేసింద‌నీ, ఇక‌పై ఈమె ద‌గ్గ‌ర ప‌నిచేయ‌మ‌ని పోలీసుల ఫిర్యాదులో ఆ బాలిక పేర్కొంది. అన్నాన‌గ‌ర్ పోలీసుల‌కు ఓ పోన్‌కాల్ రావ‌డంతో దాని ఆధారంగా ముంతాజ్ ఇంటికి వ‌చ్చారు. అక్క‌డున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను విచారించారు.
 
వారు అక్క‌డ ప‌నిచేసేందుకు భ‌య‌ప‌డ‌డంతో వారిని మ‌హిళ‌ల ర‌క్ష‌ణాకేంద్రానికి పోలీసులు పంపించారు.  దీనిపై మ‌హిళా సంఘాలుకూడా స్పందిస్తున్నాయి. ముంతాజ్‌ను పూర్తిగా విచారించి అరెస్ట్ చేశాయ‌ని వారు పోలీసుల‌కు తెలియ‌జేస్తున్నారు. ముంతాజ్ గ‌తంలో ఖుషి సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ప్రియురాలిగా న‌టించింది. ఆ త‌ర్వాత ప‌లు ఐటెంసాంగ్‌ల‌లోనూ న‌టించింది. బిగ్ బాస్ రెండవ సీజన్‌లో  పాల్గొని తమిళనాడులో మరింత పాపులర్ అయింది.