బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (08:28 IST)

చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.. ఐదు వికెట్ల తేడాతో ముంబై విన్

Chennai Super Kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. కాస్తో కూస్తో ఉన్న ప్లే ఆఫ్స్ ఆశలను కూడా చెత్తాటతో ఆ జట్టు చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 
 
మరోవైపు అందరి కన్నా ముందే వరుస పరాజయాలతో లీగ్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ముంబై.. వెళ్తూ వెళ్తూ డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నైని వెంట తీసుకెళ్లింది. 
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది.