సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ 2022 : ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్

gujarat taitans
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ అంచె పోటీల్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది. మంగళవారం రాత్రి జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లోనూ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాళ్ళు చేతులెత్తేశారు. ఫలితంగా 62 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. ఈ జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారంటే వారి ఆటతీరు ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చేతిలో వికెట్లు ఉన్పప్పటికీ ఆ జట్టు బ్యాటర్లు బ్యాట్‌ను ఝుళిపిచలేక పోయారు. శుభమన్ గిల్ 63, మిల్లర్ 26, తెవాటియా 22 చొప్పున పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, మోసిన్ ఖాన్, హోల్డర్ తలా వికెట్ తీశారు. 
 
ఆ తర్వాత 145 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చతికిలక పడింది. గుజరాత్ బౌలర్ బౌలింగ్ ధాటికే లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఎనిమిది మంది ఆటాగాళ్లు కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. డికాక్ 11, అవేశ్ ఖాన్ 12, దీపక్ హుడా 27 పరుగులు చేశారు. 
 
ఈ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. దీంతో 82 పరుగుకే కుప్పకూలిపోయింది. ఫలితంగా 62 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో గుజరాత్ అధికారింగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఫలితంగా ఆ బెర్త్ సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.