1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాజ్యసభలో సెంచరీకి దిగువకు చేరుకున్న బీజేపీ బలం

bjp flag
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం సెంచరీకి దిగువకు చేరుకున్నాయి. గత పదిరోజుల వ్యవధిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 100 నుంచి 95కు పడిపోయింది. అయితే త్వరలోనే ఈ సంఖ్య సెంచరీని దాటనుంది. ఆ పార్టీ త్వరలోనే మరో ఏడుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయనుంది. 
 
ప్రస్తుతం రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, మొత్తం 245 స్థానాలకు గాను ఇపుడు 229 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే 10, ఆప్ 8 చొప్పున ఉండగా, తెరాస, వైకాపాలకు ఆరుగురు, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎంలకు ఐదుగురు, జేడీయూ, ఎన్సీపీలకు నాలుగు, బీఎస్పీ, శివసేన పార్టీకి ముగ్గురు, సీపీఐ, స్వతంత్రులు ఇద్దరు చొప్పున, ఇతర చిన్నపార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.