గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (12:07 IST)

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ 21 ప్రశ్నలు

bandi sanjay
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా 21 ప్రశ్నలు సంధించారు. తెరాస 21వ ప్లీనరీ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో బండి సంజయ్ కూడా 21 ప్రశ్నలను సీఎం కేసీఆర్‌కు సంధించారు. ఈ ప్రశ్నలకైనా సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
గత 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని ఎన్ని అమలు చేశారో చర్చించడానికి కేసీఆర్ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై కనీసం శ్వేతపత్రం అయినా విడుదల చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటి ధరలు ఎంత ఉన్నాయి.. తెలంగాణాలో ఎంత ఉన్నాయో ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని బండి సంజయ్ కోరారు.