శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:07 IST)

టిక్కెట్ రేట్ పెంచ‌డంలో త‌ప్పులేదు - చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi
ఇప్పుడు ఏ అగ్ర‌హీరో సినిమా విడుద‌ల‌యినా వెంట‌నే వారంరోజుల‌పాటు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అందుకు ప్రభుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన సంద‌ర్భాలున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న భారీ సినిమా ఆచార్య‌. దీనికి తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని వెసులుబాటు క‌ల్పించింది.  ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. టికెట్ల  విష‌య‌మై చిరంజీవిని ప్ర‌శ్నిస్తే, ఆయ‌న ఆస‌క్లిక‌రంగా స‌మాధానం ఇచ్చారు. చివ‌ర్లో ద‌ర్శ‌కుడు కొర‌టాల కూడా మాట్లాడారు. 
 
 “చిరంజీవి  సినిమా అంటేనే అన్ని థియేటర్స్  హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ” పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా  చాలా ఇబ్బందుల్లో పడింది. వడ్డీగా 50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరిస్తారు చెప్పండి?.
ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు  ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయి. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయింది. మేము కూడా 42 పర్సెంట్ టాక్స్ లు కడుతున్నాము. అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అని అడగడంలో తప్పేమి లేదు.. తప్పు అని కూడా అనుకోవడం లేదు” అని అన్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.