ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:24 IST)

రాజ‌మౌళికి ఆచార్య‌కు సంబంధం చాలా వుందంటున్న చిరంజీవి

Rajamouli,  Chiranjeevi
Rajamouli, Chiranjeevi
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి, ఆచార్య సినిమాకు చాలా సంబంధం వుంది. రాజ‌మౌళి స‌హ‌క‌రించ‌క‌పోతే ఆచార్య అనుకున్న‌టైంకు పూర్తి అయ్యేది కాదంటూ మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే ఆచార్య ప్ర‌మోష‌న్‌లో భాగంగా వీడియో ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. 
అంత‌కుముందు ఆర్‌.ఆర్‌.ఆర్‌.సినిమా క‌మిట్‌మెంట్‌తో రామ్ చ‌ర‌ణ్ డేట్స్ లేవు. కానీ రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య‌లో న‌టించాలి. ఇందుకు తానే రాజ‌మౌళిని క‌లిసి కాస్త డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకోమ‌ని అడిగాను. అందుకు ఆయ‌న సహృద‌యంతో స‌హ‌క‌రించారు. ఇందుకు కార‌ణం కూడా వుంది. న‌న్ను, చ‌ర‌ణ్‌ను వెండితెర‌పై చూడాల‌నేది త‌ల్లికోరిక బ‌లంగా వుండ‌డంతో అది సాధ్య‌ప‌డింద‌ని.. ఇంట‌ర్వ్యూలో కొరటాల‌తో చిరంజీవి చెప్పారు.
 
అందుకే ఆచార్య ప్రీరిలీజ్ వేడుక‌కు ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌రుకానున్నార‌ని తెలుస్తోంది. యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్‌లో వేడుక ఈనెల 23న ఘనంగా జ‌రగబోతొంది. శ్రేయాస్ ఈవెంట్స్ నిర్వహించే ఈ ఈవెంట్‌లో రాజ‌మౌళి, కొరటాల, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు ప‌లువురు సినీప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.