శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:44 IST)

త‌ల్లి అయ్యాక గ్లామ‌ర్ ఉండ‌క‌పోవ‌చ్చు అంటున్న కాజ‌ల్‌

Kajal Agarwal
Kajal Agarwal
స‌హ‌జంగా త‌ల్లి అయ్యాక హీరోయిన్ల బాడీలో మార్పులు వ‌స్తాయి. అందుకే త‌ల్లి కాక‌ముందు వున్న ఓ ఫొటోను  కాజల్ అగర్వాల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌న క‌డుపును ప‌ట్టుకుని కూర్చున ఫొటోను చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.  కాజల్, గౌతమ్ దంపతులు తమ మొదటి బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును పెట్టారు.  తన ప్రసవానంతరం గ్లామర్ గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. 

 
 సోషల్ మీడియాలో  ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. “నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది. మా ప్రసవం చాలా సంతోషకరమైనది, అఖండమైనది, సుదీర్ఘమైనది. అనిర్వచనీయమైన అనుభూతి… ఆ ఒక్క క్షణం నాకు ప్రేమ లోతెంతో తెలియజేసింది. బాధ్యతను గ్రహించాను” అంటూ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది. అంతేకాదు తాను ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో గోల్డ్ కలర్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. అయితే నీల్‌ను చూపించ‌వా అంటూ నెటిజ‌న్లు కాజ‌ల్‌కు పోస్ట్‌లు పెడుతున్నారు.