1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kajal Agarwal is feeling both anxious and happy

ఆనందం ఆందోళ‌న రెండూ ఫీల్ అవుతున్న‌ కాజల్ అగర్వాల్

Kajal Agarwal
Kajal Agarwal
ఏదీ మ‌న చేతిలో లేదనేది తెలుస్తోంది. ఇలా జీవిత పాఠాలు చెబుతుంది ఎవ‌రో కాదు. గ్లామ‌ర్ న‌టి కాజల్ అగర్వాల్. త‌ను గ‌ర్భ‌వ‌తి అయ్యాక ప‌లుసార్లు సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా వుంటూ ఫొటోలు షేర్ చేసింది. ఈరోజు మాత్రం ఆ క్ష‌ణాల కోసం వేచిచూస్తున్నానంటూ పేర్కొంటూ..  మాతృత్వం కోసం సిద్ధం అవ్వడం అందంగా ఉంటుంది.. కానీ కొంత అందోళనగా కూడా ఉంటుంది. ఒక క్షణం మీకు ప్రతిదీ నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరుసటి క్షణం ఎన్నో భయాలు, సరిగా పిల్లల్ని పెంచుతామా ఎలా ఉంటుందో అనే అందోళన ఉంటుంది. అంటూ తెలియ‌జేస్తుంది. 
 
చంద‌మామ సినిమాతో ప‌రిచ‌యం అయిన ఈ భామ క్ర‌మేణా 2కోట్ల తీసుకున్న హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా  చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో న‌టించింది.  ఆచార్య ఏప్రిల్  29న విడుదల కానుంది .ఈ సినిమా స‌క్సెస్ అయితే కాజ‌ల్‌కు బోన‌స్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.  కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది.
About Writer
డీవీ
తర్వాతి కథనం
ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు- స్క్రిప్ట్ న‌చ్చి గాలివాన చేశా - రాధికా శరత్ కుమార్