శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:09 IST)

ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఆనందంతో హెలికాఫ్టర్లో తీసుకువ‌చ్చిన లాయ‌ర్‌

Lawyer Vishal Zarekar with his baby
Lawyer Vishal Zarekar with his baby
ఆడబిడ్డ పుడితే పురిట్లోనే కడతేరుస్తున్న అనాగరికుల సమాజంలో,ఓ అద్భుతమైన కుటుంబ సభ్యులు కూడా వున్నార‌ని ఓ ఉదంతం ద్వారా తెలిసింది. 
 
ఒకవైపు కొడుకు పుట్టాలని కొందరు గుళ్ల చుట్టూ తిరుగుతుంటుంటే మహారాష్ట్రలోని పూణెలో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిన వేడుకను విభిన్నంగా జరుపుకుంది. ఇంట్లోకి వచ్చిన నవజాత శిశువుకు అపూర్వంగా స్వాగతం పలికారు. 
 
పూణెలోని షెల్‌గావ్‌కు చెందిన ఓ కుటుంబం హెలికాప్టర్‌లో తమ చిన్న దేవదూతను ఇంటికి తీసుకువచ్చింది. ఈ సంఘ‌ట‌న‌కి సంబంధించిన ఖేడ్‌లోని షెల్‌గావ్‌లోని తన ఇంటికి నవజాత శిశువును తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. 
 
బాలిక తండ్రి విశాల్ ఝరేకర్ (30 సంవత్సరాలు) వృత్తిరీత్యా న్యాయవాది. మా ఇంట్లో చాలా కాలం తర్వాత ఆడబిడ్డ పుట్టిందని, ఎనలేని సంతోషంగా ఉంద‌ని విశాల్ అన్నారు.ఏప్రిల్ 2 న నా భార్య ,నేను రాజలక్ష్మిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువచ్చాం. దానికి లక్ష రూపాయలు ఖర్చు చేశానని విశాల్ చెప్పాడు.