శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (18:20 IST)

దేవునిపై కోపం వ్య‌క్తం చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Varma- Maa istam team
రామ్‌గోపాల్ వ‌ర్మ మంగ‌ళ‌వారంనాడు బెంగుళూరు వెళ్ళారు. అక్క‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ స‌మాథిని సంద‌ర్శించారు. ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ, పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి ఎవరికైనా అలా జరిగితే అది భగవంతుడిని నమ్మకపోవడానికి కారణం ..నాకు నిజంగా కోపం తెప్పిస్తుంది.. అంటూ చెప్పొకొచ్చాడు. దీనిపై సోష‌ల్‌మీడియాలో ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. 
 
Varma- Maa istam team
పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాత్ మ‌ర‌ణం యావ‌త్ దేశానికి షాక్‌కు గురిచేసింది. ఆయ‌న స‌మాధిని అల్లు అర్జున్‌, విజ‌య్‌, విశాల్ వంటి హీరోలు సంద‌ర్శించారు. 
ఇక వ‌ర్మ‌ బెంగుళూరు, ఆ త‌ర్వాత చెన్నై, అటునుంచి ఢిల్లీవ‌ర‌కు ప్ర‌యాణం సాగిస్తున్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా `మా ఇష్టం`. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే ఈ ప్ర‌యాణం. ఇది లెస్‌బియ‌న్ క‌థ‌. దీనిపై ఆయ‌న సినిమా చేశాడు. ఇందులో నైనా, అప్స‌రా రాణిన‌టించారు. వారితో క‌లిసి ఆయ‌న పునీత్ స‌మాథిని ద‌ర్శించుకున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్నారు.