దుబాయ్ అభిమానులు మాతో చేరండి - రాజమౌళి
Rajamouli, RRR, Ramcharan
దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. ఇప్పటికే కరోనాకుముందు దుబాయ్ వెళ్ళిన ఆయన ఇప్పుడు తన టీమ్‌తో మరోసారి వెళ్ళారు. శుక్రవారంనాడు దుబాయ్ వాసులకు పవిత్రమైన రోజు, కార్మికులకు సెలవుదినంగా ప్రకటించడం మామూలే. అందుకే ఈరోజు సాయంత్రం అక్కడ ఎక్స్ పో 2020 ప్రాంతంలో ప్రపంచంలో ఎత్తైన బురుజు ప్రాంతంలో ఆర్.ఆర్.ఆర్. ప్రీరిలీజ్ వేడుక చేస్తున్నారు.
కొద్దిసేపటి కిత్రమే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి నడుస్తూన్న సరదాగా జోక్‌లు వేసుకుంటూన్న రామ్‌చరణ్, ఎన్.టి.ఆర్., రాజమౌళిలు సోషల్‌మీడియాలో చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఇక్కడ అభిమానుల కోరికమేరకు ఈవెంట్ పెట్టినట్లు రాజమౌళి తెలిపారు.
య్యూ ట్యూబ్ ఛానల్‌లో టెలికాస్ట్
అనంతరం రేపు అనగా మార్చి 19వ తేదీ శనివారంనాడు బెంగుళూరు బోర్డర్ చిక్‌బళ్ళాపూర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. బెంగుళూరు- హైదరాబాద్ హైవేలోని అగలాగురికి అనే విలేజ్లో ఈ వెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వేడుకను నిర్మాత డి.వి.వి. దానయ్యకు చెందిన డివివి ఎంటర్‌టైన్ మెంట్ య్యూ ట్యూబ్ ఛానల్‌లో టెలికాస్ట్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. లైవ్ ఫీడ్ వారే అందరికీ అందజేయనున్నట్లు తెలిపారు.