మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:15 IST)

పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు

దేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ పోటీల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాను పూణెలో అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.27 లక్షల నగదు, ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముఠా సభ్యులు ఇరు జట్లపై బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు. 
 
పూణెలోని కాలేవాడి ప్రాంతంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, ఈ బెట్టింగ్ ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పూణె డిప్యూటీ కమిషనర్ మన్‌చక్ ఇప్పర్ వెల్లడించారు. అరెస్టు చేసినవారిపై 353, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.