చిరంజీవిని జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘరానామొగుడు
Chiranjeevi, K. Raghavendra Rao
మెగాస్టార్ చిరంజీవి, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో పలు చిత్రాలు బాక్సీఫీస్‌ను షేక్ చేశాయి. తెలుగులో 10 కోట్ల షేర్ చేసిన ఈ సినిమాతో నేషనల్‌లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా చిరంజవికి గుర్తింపు వచ్చింది. కన్నడ సినిమా అయిన `అనురాగ అనురితు ఆధారా` చిత్రం ఆధారంగా రూపొందింది. చిరంజీవి సరసన నగ్మా, వాణీవిశ్వనాథ్ నటించగా శరత్ సక్సేనా, సుధ, రావురమేష్ .కైకాల సత్యనారాయణ పి.ఎల్. నారాయణ, ఆహుతిప్రసాద్.. పొన్నాంబళం తదితరులు నటించారు.
డిస్కోశాంతి ప్రత్యేక పాటలో నర్తించింది. పొగరుబోతు భార్యను దారిలోకి తెచ్చుకునే కథాంశమే ఈ చిత్ర కథ. ఇందులో బంగారు కోడిపెట్ట, ఏ పిల్ల, ఏందిబే ఎట్టాగా, కప్పుకో దుప్పటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూరించాయి. దేవీ ఫిలింస్ పతాకంపై కె. దేవీవరప్రసాద్ తన బేనర్‌లో నిర్మించిన ఈ సినిమా 1992 ఏప్రిల్ 9న విడుదలై అఖండ విజయం సాధించింది. తెలుగులో 56 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మలయాళంలో `హే హీరో` పేరుతో విడుదలై త్రివేండ్రంలో 175 రోజులు ప్రదర్శించడం విశేషం. నేటితో ఘరానా మొగుడు 30 వసంతాలు పూర్తిచేసుకుంటుంది.