శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (14:19 IST)

చింతపండు బస్తాల్లో గంజాయి.. లారీ డ్రైవర్ లారీని ఆపకుండా..?

ganja
ఒడిశాలో చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. గంజాయిని  తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలిసింది. మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చింతపండు లోడుతో వెళ్తున్న లారీని గుర్తించారు. 
 
లారీ డ్రైవర్ లారీని ఆపకుండా వేగంగా పోనిచ్చేసరికి అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి లారీని ఆపారు.  లారీలో చింతపండు ఉందని డ్రైవర్  కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతాప్ పాత్రో చెప్పారు.
 
కాగితాలు చూపించారు.  అయినా అనుమానం వచ్చిన పోలీసులు లారీలో తనిఖీ చేయగా చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది.
 
స్వాధీనం చేసుకున్న 15 క్వింటాళ్ల  గంజాయిని 63 బస్తాల్లో నింపి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలుసు కున్నారు. గంజాయి విలువ కోటి రూపాయలు పైగా ఉంటుందని మల్కన్ గిరి ఎస్డీపీఓ సువేందు కుమార్ పాత్రో తెలిపారు.