సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (11:40 IST)

68 ఏళ్ల వ్యక్తి 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు.. ఆస్తి మొత్తం?

ఇంగ్లండ్‌లో విచిత్రమైన పెళ్లి జరిగింది.  68 ఏళ్ల వ్యక్తి తనకంటే 23 ఏళ్లు పెద్ద అయిన 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు. పెళ్లైన కొన్ని సంవత్సరాలకు అతను కోటీశ్వరుడయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న 91 ఏళ్ల జోన్ బ్లాస్ అనే మహిళ 2016 హత్యకు గురైంది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ఆమె 68 ఏళ్ల వ్యక్తిని వివాహమాడింది. ఆమె పేరిట రూ.2 కోట్ల ఆస్తి ఉంది. 
 
పెళ్లై కొంతకాలం వీరి జీవితం సాఫీగా సాగింది. ఆ తరువాత ఆమె చనిపోవడంతో.. ఆ ఆస్తి అంతా ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి దక్కింది. అయితే, సదరు వృద్ధురాలి కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అతనిపై రివర్స్ కేసు పెట్టారు.
 
అయితే, సదరు వ్యక్తి జోన్ బ్లాస్‌ను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడని రుజువు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మహిళ కుమారుడు, కుమార్తె అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. మహిళకు చెందిన రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు ఆమె భర్త పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.